గమనిక : చాట్ రూమ్ కింద ఉన్నదీ ,దయచేసి గమనించ గలరుNOTE: Please check chat room1 and chat room 2 above the footer. .

అమ్మాయిలను ఆకర్షించేదెలా?


అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే రై.. రై.... మంటూ బైక్‌లో దూసుకెళుతూ చక్కర్లు కొడుతుంటారు. అబ్బాయి అమ్మాయి వెంట పడీ పడీ అలసిపోయి, అవమానాలు, సత్కారాలు, తిట్లు, చెప్పుకుంటే ఎన్నెన్నో.... అమ్మాయితో పరిచయం పెంచుకోవడానిక అన్ని అవస్థలు పడుతుంటారు, కానీ అమ్మాయిని నుంచి రెస్పాన్స్ ఉండదు. అసలు అమ్మాయిని ఆకర్షించడం ఎలా? 

1.) స్మైల్: ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడాలి, ఇది మీలోని అత్మవిశ్వాసాన్ని చూపుతుంది. అదే చిరునవ్వు ఇతరులను రిలాక్స్ అవ్వడానికి కారణమౌతుంది. అలాగే మీ నవ్వుకు కాస్త సరదా మాటలను కలపండి. తను మీతో చనువును పేరిగే దాక అలాగే కొనసాగించాలి. 

2.) డ్రస్సింగ్: మీరు ధరించే దుస్తులుపై అమ్మాయిలు ఖచ్చితమైన అంచనాలు వేస్తారు, కనుక జాగ్రత్తగా దుస్తులను ఎంచుకోవాలి. క్రొత్త మోడళ్లను ట్రై చేస్తుండాలి. 


3.) ఫిట్‌నెస్: ఫిట్ మరియు హెల్తీగా ఉంటే సులభంగా అమ్మాయిల దృష్టిని ఆకర్షించవచ్చు. మీరు అథ్లెట్ కాకపోయిన మీకు వర్కవుట్ చేయడం ఇష్టం లేకున్నా, మీ నడిచే స్టయిల్, నిలబడే తీరు, ఇంకా మీ బుజాలు అవి ముందుకు వాలిపోయివుంటే వెనుకకు సరిచేసుకోండి, అలాగని మీ బుజాలను బిగుసుకున్నట్టు ఉంచుకోకూడదు. మీరు రిలాక్స్‌గా ఉన్నట్లు అమ్మాయి దృష్టిలో భావించేలా నడుచుకోవాలి.