గమనిక : చాట్ రూమ్ కింద ఉన్నదీ ,దయచేసి గమనించ గలరుNOTE: Please check chat room1 and chat room 2 above the footer. .

ప్రేమికులను మత్తులో ముంచే "టచ్"లెన్నో తెలుసా..?


ప్రేమమైకంతో మరో లోకంలో విహరించే ప్రేమికులు రోజుకు ఎన్నిసార్లు ఒకరికొకరు టచ్ చేసుకుంటారన్న దానిపై పరిశోధకులు దృష్టి సారించారు. వారి శోధనలో తేలిందేంటయా అంటే... రొమాంటిక్ కపుల్స్ రోజులో సందర్భం దొరికినపుడల్లా ఎక్కడో అక్కడ టచ్ చేసుకుంటూనే ఉంటారట. ఒక రోజులో కపుల్స్ ఒకరికొకరు చేసుకునే టచ్‌లలో 8- 12 టచ్‌లు మహా మత్తులోకి తీసుకెళతాయట.



అంతేకాదండోయ్... తన లవర్‌ను ఐస్ చేసే కొన్ని చిట్కాలను కూడా వారు చెప్పారు. వాటిలో కొన్ని...



మీరు ప్రేమించిన అమ్మాయికి "ఐ లవ్ యూ" చెప్పేముందు, ఆమె కళ్లను పరీక్షగా చూడండి. ప్రశాంతంగా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. లేదంటే అప్పటికి మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.



ప్రేయసి బుంగమూతి పెట్టుకుని కూర్చున్నప్పుడు అమాంతం ఆమెను ఎత్తుకుని ముద్దాడాలి. ఇలా చేసిన మరుక్షణం అప్పటివరకూ చిందులేస్తూ భగభగలాడే ప్రేయసి కూల్ అయిపోతుంది. 



ఎంత బతిమాలినా వినని, ఎంత ముద్దాడినా కనికరించని మొండి ప్రేయసి మనసు మైనంలా కరగదీయటానికి మహత్తర మార్గం ఒక్కటే. అదేమంటే ఆమెను అమాంతం పైకి ఎత్తుకుని బిగి కౌగిలిలో బంధించాలి. 



ముఖం చిట్లుంచుకుని అటువైపు తిరిగి కూర్చున్న సఖిని ప్రసన్నం చేసుకోవాలంటే వేడుకోలు ఒక్కటే మార్గం. ప్రియుడు ఆమె ముందు మోకరిల్లితే కోపం "తుస్" మంటుంది. ప్రేయసి మామూలైపోతుంది.



పని మీద వేరే ఊరికి వెళ్లినప్పుడు గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చెయ్యడం మరువకండి. దీంతో మీకు ప్రపంచంలో ఆమె కన్నా ప్రియమైన వారు ఎవ్వరూ లేరన్న భావనను వ్యక్తీకరించినట్లు అవుతుంది.